బార్లలను తలపిస్తున్న బ్రాంది షాపులు నిబంధనలకు తిలోదకాలు పట్టించుకోని ఎక్సైజ్, సెబ్ అధికారులు! పొదలకూరు : మండలంలోని కొన్ని మద్యంషాపులు బార్‌లను తలపిస్తున్నాయి. నిబంధనలను గాలికి వదిలేసి రేకుల షెడ్లు వేసి బెంచీలు, టేబుళ్లు వేసి యథేచ్ఛగా సిట్టింగులను నడిపిస్తున్నా కూడా ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా వైన్ షాపుల పక్కన, వెనుకాల నివాసగృహాలు ఉన్నా కూడా నడిపిస్తున్నారు. మండలంలో 7 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో విచ్చలవిడిగా సిట్టింగులను నిర్వహిస్తున్నారు. మద్యంప్రియులకు కావాల్సిన తినుబండారాలు, …
బార్లలను తలపిస్తున్న బ్రాంది షాపులు
నిబంధనలకు తిలోదకాలు
పట్టించుకోని ఎక్సైజ్, సెబ్ అధికారులు!
పొదలకూరు : మండలంలోని కొన్ని మద్యంషాపులు బార్‌లను తలపిస్తున్నాయి. నిబంధనలను గాలికి వదిలేసి రేకుల షెడ్లు వేసి బెంచీలు, టేబుళ్లు వేసి యథేచ్ఛగా సిట్టింగులను నడిపిస్తున్నా కూడా ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా వైన్ షాపుల పక్కన, వెనుకాల నివాసగృహాలు ఉన్నా కూడా నడిపిస్తున్నారు. మండలంలో 7 మద్యం షాపులు ఉన్నాయి.
వీటిలో విచ్చలవిడిగా సిట్టింగులను నిర్వహిస్తున్నారు. మద్యంప్రియులకు కావాల్సిన తినుబండారాలు, వాటర్‌పాకెట్లు, వాటర్‌బాటిళ్లు, గ్లాసులు ఏర్పాటు చేసి సిట్టింగులను నిర్వహిస్తున్నారు.
ఈ సిట్టింగుల వల్ల మద్యంప్రియులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు. తర్వాత ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని మండలాల్లో వైన్‌షాపుల పక్కనే నివాసగృహాలు ఉన్నాయి.ఈ సిట్టింగులను నిర్వహించడం వల్ల ఆయా గృహాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆదాయమే లక్ష్యంగా వైన్ షాపులకు టార్గెట్లు విధిస్తున్న ఎక్సైజ్ శాఖాధికారులు నిబంధనలను పాటిస్తున్నారా, లేదా అనే విషయమై తనిఖీలు చేయడం లేదు. వైన్ షాపుల యజమానులు నెలనెలా ఇచ్చే మామూళ్లు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
కొన్నిచోట్ల వైన్‌షాపుల యజమానులు సమయపాలన పాటించడం లేదు. ఇష్టారాజ్యంగా వైన్‌షాపులను నడిపిస్తున్నా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు స్పందించి తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.