HealthKhammamPoliticalTelangana

సాంబారు గిన్నెలో పడిన చిన్నారిని పరామర్శించిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి

సాంబారు గిన్నెలో పడిన చిన్నారిని పరామర్శించిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి

సాంబారు గిన్నెలో పడిన చిన్నారిని పరామర్శించిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి

మెరుగైన చికిత్స అందించాలి అంటూ సూచనలు..

కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సందర్శన

సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : ఇటీవల ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడిపోయి తీవ్రంగా గాయపడిన పెరిక సింగారం గ్రామానికి చెందిన అడపాల మనోహర్ ను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.

ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాలుడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.

అనంతం ఆస్పత్రి మెడికల్ సూపరింటెoడెంట్ ఎల్.కిరణ్ కుమార్ ను కలిసి..వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి లోపల అంతా పరిశుభ్రంగా వుంచారని అభినందించారు.

ఇలాంటి శ్రద్ధ నే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, నాయకులు దుంపల రవి, మంకెన వాసు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button