పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నాం…
– ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాలీబాల్, క్రికెట్ కిట్లను అందించాం
– పీఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం రూరల్ : గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభ వెలికితీసేందుకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సాహించడం జరుగుతుందని, ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని గ్రామీణ క్రీడాకారులకు వాలీబాల్, క్రికెట్ కిట్లను అందించడం జరిగిందని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు.
ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరిలో పీఎస్ఆర్ యూత్ నాయకుడు ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో పీఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ పేరిట పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను దయాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడాలపై మక్కువ, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీద అభిమానంతో క్రీడలను ప్రోత్సాహించాలనే సద్దుదేశ్యంతో పోటీలకు శ్రీకారం చుట్టిన ఏనుగు మహేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులోనూ క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి పొంగులేటి కూడా తనవంతు క్రీడాకారులకు సహాయ సహకారాలను అందిస్తారని తెలిపారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తి చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీ వై ఎస్ ఓ తుంబూరు సునీల్ రెడ్డి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు కూరపాటి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.