“బట్టు రామచంద్రయ్య జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం”
— ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలయ్య
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) ఫిబ్రవరి 02
సామాజిక ఉద్యమ నాయకులు అలుపెరుగని పోరాట యోధుడు బట్టు రామచంద్రయ్య జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు.
బట్టు రామచంద్రయ్య 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా స్థానిక పాత వివేర హోటల్ లో జరిగిన రాజ్యాంగ రక్షణ – పౌర సమాజ పాత్ర అను అంశంపై సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని కలిగిఉండాలన్నారు.మన ప్రాంతంలో ఉద్యమాలకు ఊపిరి పోస్తూ ఇంత వయసులో కూడా ఇంకా కూడా ప్రజా ఉద్యమాలలో కొనసాగడమంటే అందరికి సాధ్యమయ్యేది కాదని అన్నారు.
తన జీవితమంతా అట్టడుగు వర్గాలపక్షాన, కార్మికుల పక్షాన,అసంఘటిత రంగ ప్రజల పక్షాన నిరంతరం నిలబడి అండగ ఉండే వ్యక్తి అని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు.
మాజీ శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశ పౌరులందరు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.అందుకోసం సామాజిక ఉద్యమనాయకులు కృషి చేయాలన్నారు.
రామచంద్రయ్య నుండి నేర్చుకోవలసిన అనేక విషయాలున్నాయని అతని జీవితం ఆదర్శప్రాయమని అన్నారు.అనంతరం శాలువతో సత్కరించారు.బట్టు రామచంద్రయ్య ప్రజాపోరాటాల మహానాయకుడని సీపీఎం రాష్ట్ర నాయకులు చెరుపల్లి సీతారాములు, భువనగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ బర్రె జహంగీర్ లు అన్నారు.
బట్టు రామచంద్రయ్య పేదప్రజల పక్షాపాతి అని ప్రజల పక్షాన నిలబడే వారిలో రామచంద్రయ్య ముందు వరుసలో ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమానికి సురుపంగ శివలింగం,ఇటుకల దేవేందర్ ,భాస్కర్ నాయక్ లు సమన్వయం చేయగా సీపీఐ జిల్లా కార్యదర్శి గోడ శ్రీరాములు,కౌన్సిలర్ పడిగేలా రేణుక ప్రదీప్,ఏశాల అశోక్, ఎం.డి ఇమ్రాన్,సామాజికోద్యమ నాయకులు బండారు రవివర్ధన్,దర్లాయి నర్సింగరావు,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగారం అంజయ్య,అద్వకేట్ రహీం,కలకుంట్ల జయ,కొల్పుల అమరెందర్,బర్రె సుదర్శన్, మల్లారెడ్డి,శ్రీనివాసచార్యులు,
కార్తాల శ్రీనివాస్,పాశం భాస్కర్, ఉప్పల ఉదయ్ కుమార్,ఎర్ర జాన్సన్, దర్లాయి హరిప్రసాద్, పల్లెర్ల వెంకటేష్, కావలి యాదయ్య,పులిగిల్ల బాలయ్య, కొల్లూరీ హరీష్, నల్ల మధు, మహేశ్, కనుకుంట్ల పాండు, బెల్లి చంద్రశేఖర్, నల్ల నరేందర్, దుబ్బా రామకృష్ణ, బాలేశ్వర్, దర్ఫై దేవేందర్, డాక్టర్ బుచ్చయ్య, సురారం జానీ, ఉప్పల శాంతి కుమార్, అన్నంపట్ల కృష్ణ ,వనం రాజు, బట్టు నర్సింగరావు,వడ్డేపల్లిదాస్,బర్రె నగేష్ తదితరులు పాల్గొన్నారు.