గుజ్జ యాదగిరి కుటుంబానికి పద్మశాలి చేయూత సభ్యులు బియ్యం అందజేత…
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) ఫిబ్రవరి 04
ఇటీవల అకాల మరణం పొందిన గుజ్జ యాదగిరి కుటుంబమును పద్మశాలి చేయూత సభ్యులు పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేశారు.
ఆలేరు పట్టణంలోని భరత్ నగర్ లో గుజ్జ యాదగిరి కుటుంబ సభ్యులను ఆదివారం రోజున డాక్టర్ చింతకింది మురహరి,చిక్క శ్రావణ్ కుమార్ పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి కి చేయూత సభ్యులు చిక్క శ్రావణ్ కుమార్, వంగరి శివకుమార్, డాక్టర్ చింతకింది వెంకటేష్,గజ్జల రమేష్, చింతకింది వెంకటేష్,బేతి బాలరాజు,ఎన్నం సోమరాజు,ఎలగందుల దయాకర్, చింతకింది బాలరాజు,భరత్ తదితరులున్నారు.