మద్యం మత్తులో ఫైట్.. మధ్యలో వెళ్లిన రూరల్ ఏస్ఐ పై దాడి చేసిన గ్యాంగ్
దాబాలో మద్యం గ్యాంగ్ హల్చల్
దాబాల్లో అర్థరాత్రి వరకు మద్యం సేవించడం.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ఇదేంటని అడిగిన వారి పై దాడి చేయడం పరిపాటిగా మారింది.పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టిన అఘంతుకులు తప్పించుకోవడం మామూలుగా మారింది.
దాబాల్లో మద్యం, స్టఫ్ తిని బిల్లు ఇవ్వమంటే ఎదురు తిరిగి నిర్వాహకులపై దాడి చేసిన ఘటన రూరల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డు వద్ద రమేష్దాబా-2లో ఖమ్మం రేవతిసెంటర్కు చెందిన పలువురు యువకులు మద్యం సేవించి స్టఫ్ తిని నాలుగు వేలు బిల్ చేశారు.
నిర్వాహకులు బిల్లు ఇవ్వమని అడిగితే వారి పై దాడికి దిగారు. అదే టైంలో తెల్దారుపల్లికి చెందిన రాంబాబు, ఉపేందర్‌లు కూడా రోటీలు తింటున్నారు. దాడికి దిగిన సందర్భంలో గ్యాంగ్ వచ్చి రాంబాబు పై పడటంతో గొడవ మొదలైంది.
రాంబాబు, ఉపేందర్ల పై కూడా ప్రతి దాడికి దిగారు. ఈ దాడిలో రాంబాబు తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ సురేష్ సంఘటన స్థలానికి వచ్చి గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్ ముందు రేవతిసెంటర్కు చెందిన యువకులు మరో 20 మంది వచ్చి నానా హైరానా సృష్టించారు. ఎస్ఐ సురేష్ ఇరువర్గాలను వారించి శాంతిపజేశారు. రాంబాబు నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రేవతిసెంటర్కు చెందిన ఆరుగురి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి క్షతగ్రాతులైన రాంబాబు, ఉపేందర్‌ను
ఖమ్మం నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ గమనించిన గ్యాంగ్ ఒక్కసారిగా 50 మందికి పైగా హాస్పిటల్లో ఉన్న వారి పై దాడికి దిగారు. అక్కడే ఉన్న ఎస్ఐ సురేష్ పై కూడా గ్యాంగ్ దాడికి దిగింది.
తెల్దారుపల్లికి చెందిన యువకులపై దాడి చేయాలని ప్రయత్నించగా అడ్డుకున్న ఎస్ఐ సురేష్ తలకు, చేతికి గాయాలైయ్యాయి. ఎస్ఐ సురేష్ సంఘటన స్థలంలో లేకపోతే ప్రాణనష్టమే జరిగేదని పలువురు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
ధైర్యంగా ఎదురునిలబడి మద్యం మత్తులో ఉన్న గ్యాంగ్‌ను నిలువరించడంలో తన ప్రాణాలనుసైతం లేక్కచేయకుండా అడ్డుకున్న ఎస్ఐ సురేష్ ధైర్యసాహసాలను పలువురు కొనియాడుతున్నారు. రేవతి సెంటర్ గ్యాంగ్ కోసం పోలీసులు గాలించగా ఇప్పటికి 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి పై ఖమ్మం టూ టౌన్లో కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.