రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్?
సికె న్యూస్
ఎలక్షన్ కమిషన్ నేడు పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీకాలం పూర్తి కానుంది. తెలంగాణ లో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధి కంగా యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈనెల 15 వరకు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఫిబ్రవరి 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.
తెలంగాణలో ఏప్రిల్ నాటికి వద్దిరాజు రవిచంద్ర, లింగ య్య, సంతోష్ పదవీ కాలం పూర్తి కానుంది. ఏప్రిల్ నాటికి ఏపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల, వేమిరెడ్డి పదవీకాలం పూర్తి కానుంది….