PoliticalTelangana

ఘనంగా 33 వ బాల బాలికల సబ్ జూనియర్ కబడ్డి సెలక్షన్స్…..

ఘనంగా 33 వ బాల బాలికల సబ్ జూనియర్ కబడ్డి సెలక్షన్స్…..

ఘనంగా 33 వ బాల బాలికల సబ్ జూనియర్ కబడ్డి సెలక్షన్స్…..

ముఖ్య అతిథిగా కేసరి యూత్ క్లబ్ అధ్యక్షులు రేగు బాల నరసయ్య….

సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 11

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరు క్రీడా మైదానంలో ఆదివారం రోజున 33 వ బాల బాలికల సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ ఘనంగా జరిగాయి.సెలక్షన్స్ కు జిల్లా నుండి బాల బాలికలు 285 మంది పాల్గొన్నారు.

ఇట్టి క్రీడలకు ముఖ్య అతిథిగా కేసరి యూత్ క్లబ్ అధ్యక్షులు రేగు బాల నరసయ్య పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సభ నిర్వాహకులుగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య వ్యవహరించారు.

ఈ సందర్భంగా పూల నాగయ్య మాట్లాడుతూ..జిల్లాలో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కబడ్డీ క్రీడాకారులను తయారుచేసి జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలని అన్నారు.ముఖ్యఅతిథి రేగా బాల నరసయ్య మాట్లాడుతూ… క్రీడలు మానసిక ప్రజలతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇస్తుందన్నారు..

ఇట్టి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మోత్కూరు యాదయ్య, ప్రధాన కార్యదర్శి తగ్గాపర్,కోశాధికారి గంధమాల కుమార్,సహాయ కార్యదర్శి చిందం విజయకుమార్ చంద్రకుమార్ జిత్తు నరేష్,యాట సందీప్,ప్రదీప్,ఆంజనేయులు. అనిల్,నాగ పూర్ణిమ,అనుష. దళపతి మరియు ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button