భద్రాచలంలో మద్యం దందా…!
ఎం.ఆర్.పి ధరలకు మంగళం.
300లకు పైగా బెల్ట్ షాపులు.
పట్టించుకోని ఎక్సైజ్ శాఖ.
ఎక్సైజ్ మినిస్టర్ ను కలుస్తాం.
ప్రెస్ మీట్ లో టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అజీం వెల్లడి.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 11,
భద్రాచలంలోని రెడ్డి సత్రం నందు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ అజీమ్ ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…మద్యం కొత్త పాలసీ వచ్చిన తర్వాత భద్రాచలంలో మద్యాన్ని ఎమ్మార్పీ ధరలకే, బెల్ట్ షాపులు కూడా ఎమ్మార్పీ ధరకే మద్యం అమ్మకాలు చేశాయని, కానీ ప్రస్తుతం క్వార్టర్ మద్యంపై రూ.20 రూపాయలు మద్యం షాపులు వారు అధికంగా అమ్మితే, మరో 20 రూపాయలు కలిపి అధిక ధరలకు బెల్ట్ షాపులు మద్యం అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై భద్రాచలం ఎక్సైజ్ సీఐని కలిసి భద్రాచలం మద్యం బెల్టు షాపులు సుమారు 300 ఉన్నాయని, నెలకు రూ.10 లక్షల రూపాయలు వరకు అధికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, ఒక క్వార్టర్ బాటిల్ పై రూ.20 రూపాయలు అధికంగా వసూలు చేస్తే బెల్ట్ షాపులు
మరో రూ.20 రూపాయలు అధికంగా మొత్తం రూ.40 రూపాయ వరకు సామాన్య ప్రజలు వద్దనుండి అధికంగా వసూలు చేస్తున్నారని తెలపడం జరిగిందని,ఈ విషయం పై చర్యలు తీసుకోవాలని కోరగా తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఎక్సైజ్ సీఐ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
కాగా బెల్ట్ షాపులలో దొరికే బ్రాండెడ్ బాటిల్స్ మద్యం షాప్ లో దొరకట్లేదనీ, బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు పూర్తయిన తర్వాత మద్యం షాప్ లో ఓపెన్ చేస్తున్నారని, స్కూల్స్, టెంపుల్స్, చర్చలు, మసీదులు వద్ద బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని కోరినా
పట్టించుకోవడంలేదని, రానున్న రోజుల్లో భద్రాచలం పట్టణంలో బెల్ట్ షాపులను తొలిగించాలని ఎక్సైజ్ ఉన్నత అధికారులను, ఎక్సైజ్ శాఖ మంత్రి కలవడం జరుగుతుందని అజీం పేర్కొన్నారు