కాంగ్రెస్ ప్రభుత్వంలో గాంధీ గిరి బాట పట్టిన పంచాయతీ కార్యదర్శి.
ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన షాపుల పై వినూత్నంగా గాంధీ మార్గంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టిన పంచాయతీ సిబ్బంది..
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 13
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ సారపాక లోని రోడ్లకు ఇరువైపులా ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్న అన్ని.. షాపులపై వినూత్నంగా గాంధీ మార్గంలో హితబోధ చేస్తున్న పంచాయతీ కార్యదర్శి
.ఫుట్‌పాత్ ను ఆక్రమించి ముందుకు పెట్టి వ్యాపారం నిర్వహిస్తున్న షాపులను వెనక్కి తీసుకునే విధంగా.. వారి వస్తువులను పంచాయతీ సిబ్బందితో వారి షాపుల్లోనే పెట్టించి.. మీరు ఎన్నిసార్లు ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా మేము వచ్చి ఇలానే చేస్తాము.. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం తప్పు, దానివలన స్థానిక ప్రజల రాకపోకలకు మరియు రవాణాకు ఇబ్బందికరంగా ఉంటుంది..
అంటూ షాపుల యజమానులకు సామరస్యంగా వివరించి.. పంచాయితీ సిబ్బందితో కలసి పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్న.. సారపాక మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భద్రాద్రి మీడియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులతో మాట్లాడుతూ… గతంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్న అందరికీ ఎన్నోసార్లు.. పంచాయతీ తరపున నోటీసులు ఇవ్వడం జరిగింది.
అలానే షాపులు నిర్వహణ యజమానులు ఫుట్‌పాత్‌ల పై పెట్టిన వస్తువులను మరియు ప్లాస్టిక్ కవర్లను పంచాయతీ సిబ్బంది దాడులు నిర్వహించి పంచాయతీ ఆఫీస్ కు తరలించడం జరిగేది..
మరలా వాళ్ళు వచ్చి మా సిబ్బంది తో మాట్లాడి మేము ఫుట్‌పాత్‌లను ఇంకొకసారి ఆక్రమించం అలా జరిగితే మాపై యాక్షన్ తీసుకోండి అంటూ. పంచాయతీలో అర్జీ పెట్టుకొని ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకెళ్లటం సదా మామూలుగా ఉండేది.
ఈ ఫుట్‌పాత్‌ల పై వ్యాపారం నిర్వహిస్తున్న వారి వలన ట్రాఫిక్ సమస్య మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుండగా.. సదరు వ్యాపారస్తుల మనసు ఈ రకంగా అయినా మారుతుందేమోనని.. గాంధీ మార్గాన్ని ఎంచుకోవడం జరిగిందని అంటున్న పంచాయతీ కార్యదర్శి మహేష్.
చాలాసార్లు వారికి నోటీసులు ఇచ్చి దాడులు నిర్వహించి మా పంచాయతీ సిబ్బంది కూడా విసిగిపోయారని ఈ రకంగా నైనా వారిలో మార్పు కలిగి ఫుట్‌పాత్‌లను కాలినడక వారికి వదిలేస్తారని ఆ రకంగా సారపాక లోని బిజీగా ఉండే బిజినెస్ ఏరియాలలో కొంతైనా పార్కింగ్ సౌకర్యం కల్పించి ట్రాఫిక్ నియంత్రించే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు మహేష్ తెలిపారు.
ఏదేమైనా ఇప్పటివరకు గాంధీ మార్గం అనేది విజయాన్ని మాత్రమే సొంతం చేసుకుందని ఈ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా సారపాక ఫుట్‌పాత్‌లపై వ్యాపార నిర్వహిస్తున్న వారిలో మార్పు రావాలని మరల ఇటువంటి సమస్య రిపీట్ కాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్న.. బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అండ్ భద్రాద్రి మీడియా వెల్ఫేర్ సొసైటీ.