Andhra PradeshPoliticalTelangana

రూ.25 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన డీఆర్‌ఎం

రూ.25 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన డీఆర్‌ఎం

రూ.25 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన డీఆర్‌ఎం

విశాఖపట్నం వాల్తేరు డివిజన్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) సౌరభ్‌ప్రసాద్‌ రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేసినట్లు సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆయనతో పాటు లంచం ఇచ్చిన ముంబయికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి, పుణెకు చెందిన మరో ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో డీఆర్‌ఎం వద్ద రూ.87.6 లక్షల డబ్బుతో పాటు రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, ఇతర ఆస్తి పత్రాలు, బ్యాంకు లాకర్‌ తాళాలు, బ్యాంకు ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని డీఆర్‌ఎం బంగ్లాతో పాటు మరికొన్ని చోట్ల చేసిన సోదాల్లో వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు.

డీఆర్‌ఎంతో పాటు ప్రైవేటు సంస్థల ప్రతినిధులపై నేరపూరిత కుట్ర, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతున్నట్లు సీబీఐ తెలిపింది.

గుత్తేదారుకు జరిమానా తగ్గించేందుకు..

వాల్తేరు డివిజన్‌లో ఓ గుత్తేదారు సంస్థకు తూర్పు కోస్తా రైల్వే ప్రాజెక్టు పనులు అప్పగించారు. ఆ పనులు చేయడంలో జాప్యం కావడంతో కంపెనీకి రైల్వే భారీ జరిమానా విధించింది. ఆ జరిమానా లేకుండా తప్పించేందుకు డీఆర్‌ఎం లంచం డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలోనే ముంబయి, పుణెకు చెందిన రెండు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు ఆయనను కలవగా… జరిమానా తగ్గించాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలని కోరారు. అయితే అదే ప్రైవేటు సంస్థకు రూ.3.17 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

రూ.25 లక్షల లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత పెండింగ్‌ బిల్లుల చెల్లింపులతో పాటు, జరిమానా తగ్గించేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 16న డీఆర్‌ఎంకు రూ.25 లక్షలు ఇస్తుండగా సీబీఐ వల పన్ని పట్టుకున్నట్టు ప్రకటించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button