హరీష్‌రావుకు మంత్రి కోమటిరెడ్డి బంపరాఫర్!
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. హరీష్‌రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాయన్నారు.
సీఎం కావడానికి ప్లాన్‌లో ఉన్నట్టున్నారు అంటూ సెటైర్ విసిరారు. కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని చెప్పారు.
ఆ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్‌ల పేర్ల మీద విడిపోతుందని.. టీఆర్ఎస్‌లో నాలుగు పార్టీలు అవుతాయని వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేదని.. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలన్నారు. కేసీఆర్ కట్టే పట్టుకొని తిరుగుతున్నారని… ఆయన పులి ఎట్లా అవుతారని ప్రశ్నించారు.
60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే… 86 కిలోలు ఉన్న తానేం కావాలని ప్రశ్నించారు. ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.. మరి వేచి చూడాలి ఎం జరుగుతుందో.