EducationHyderabadTelangana

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదోతరగతి చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

పద్మనాగర్ ఫేస్ 2 లోని రావ్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వినిత్ (16) ఉదయం పాఠశాలకు వెళ్లి, ఇంటర్వేల్ సమయంలో ఇంటికి వెళ్ళిన విద్యార్థి వినీత్, తల్లితండ్రులు వారి పనులకు వెళ్లడంతో ఇంట్లో ఎవరులేని సమయం చూసి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు.

పదో తరగతి చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పట్ల పలువురు విద్యార్థుల తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఏదైనా అనారోగ్య కారణాలతో జరిగిందా..?లేదా పదో తరగతి కావడంతో పాఠశాలలో చదువు విషయంలో ఒత్తిడి చేశారా అనేది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button