రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 18
ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని అర్పిత నర్సింగ్ హోమ్ డాక్టర్ ప్రభాకర్ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం రోజున రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పులిపలుపుల మహేష్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఆలేరు పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి తగిన పరీక్షలు చేసి డాక్టర్ల చేత మందులు రాయించుకున్నారు.
యశోద హాస్పిటల్ సిబ్బంది నలుగురు డాక్టర్లు డాక్టర్ సునీల్ ఆర్తో డాక్టర్ రవి గుండె నిపుణులతో రక్త పరీక్ష ఈసీజీ టుడికో పరీక్షలు నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో రాఘవ స్వచ్ఛంద సేవ సభ్యులు కళ్యాణ్ జితేందర్ నరసింహారాజు మొరిగాడి ఉపేందర్ మరియు సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..