యువత గంజాయి మత్తుకు బానిస కావద్దు
తల్లిదండ్రులు పిల్లల వ్యవహార శైలిని గమనించాలి
జిల్లా పోలీసు కార్యాలయం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
సి కె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఫిబ్రవరి 21
యువత గంజాయి మత్తుకు బానిస కావద్దని తల్లిదండ్రులు పిల్లల వ్యవహార శైలిని గమనించాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడారు
గ్రామీణ యువత అప్రమత్తంగా ఉండాలనీ, చిన్న చిన్న ప్యాకెట్ లలో గంజాయి తెచ్చి అలవాటు చేసి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తారనీ ఇలాంటి వారి మాయలో యువత పడొద్దనీ గంజాయి మత్తుకు బానిసలు కావద్దు.
తల్లిదంద్రులు మీ పిల్లల భవిష్యత్తును గమనించాలని గంజాయి నిర్మూలనలో పోలీసు వారితో సహకరించి సమాచారం అందించి, మీ పిల్లల భవిష్యత్తును కాపాడాలని అన్నారు.