EducationTelangana

పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసు..!

పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసు..!

ఇంటర్ విద్యార్థులు అలర్ట్‌….

పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసు..!

Telangana : ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడినా.. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. పరీక్షల్లో తప్పుడు విధానాలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఎవరైనా వచ్చి పరీక్ష రాసినా… మరేదైనా తప్పుడు విధానాలు అవలంబించినా… వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు.

అటువంటి అభ్యర్థులు పరీక్ష నుండి డిబార్ చేయబడతారు. అంతేకాదు ఆ సమయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు లేదా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 19 వరకు జరగనున్నాయి. పై హెచ్చరిక ఈ పరీక్షలకు వర్తిస్తుంది.

ఈసారి ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాల్లో 12,559 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 6,109 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,450 మంది విద్యార్థులు మొత్తం 30 కేంద్రాల్లో 20 ప్రభుత్వ, 10 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షలు రాయనున్నారు.

పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు 8.45 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలి. కాలేజీ యాజమాన్యం బలవంతంగా ఫీజులు వసూలు చేయకుండా హాల్ టిక్కెట్లు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్షలకు అనుమతిస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button