HealthKhammamPoliticalTelangana

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం (వీడియో)

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం (వీడియో)

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం (వీడియో)

పాముకాటుతో వచ్చిన మహిళ..

ముచ్చట్లకు పరిమితమైన డాక్టర్లు

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బి.వెంకటమ్మ (70) సం” కూలి పనిలో భాగంగా పొలంలో పనికి వెళితే పాము కాటు వేసింది.

దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళితే ఒపి రాయడానికి సుమారు 15 నిమిషాలు ఆ తరువాత మళ్ళీ లోపలికి వెళితే టెస్ట్లు చేయించుకొని రండి అంటూ ఆ తరువాత ఫైల్ తీసుకొని రండి అంటూ టైం వేస్ట్ చేసిన డాక్టర్లు, ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చొని నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతున్న వైనం…

కనీసం పాము కరిచి నడవలేని స్థితిలో ఉన్న మహిళను కుర్చీ లోంచి లేచి వచ్చి చూడరా మేడం అని అడిగితే అరవకండి అంటూ దురుసుగా సమాధానం చెప్తున్న వైనం ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు కనిపించడం లేదు..

నిర్ణీత సమయానికి ఉదయం రావాల్సిన వైద్య సిబ్బంది తమకు నచ్చిన సమయానికి వస్తూ మధ్యాహ్నం లోపే ఇంటిదారి పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు..

ఈ సందర్భంగా బాధితురాలు వెంకటమ్మ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉన్న ఇలాకలో ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్లపై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైనది కాదని ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడటం సరైనది కాదని

దీనిపై జిల్లా వైద్యశాఖ తక్షణమే చర్యలు తీసుకొని పేషంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని తన లాగా వేరొక పేషెంట్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులను, ముగ్గురు మంత్రులను సోషల్ మీడియా ద్వారా కోరడం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button