రూ.500కే గ్యాస్ సిలిండర్.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది.
మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme)లోని రూ.500కే గ్యాస్ సిలిండర్ (gas cylinders) స్కీమ్‌ను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది.
ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది.
సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 39.5 లక్షల లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్‌ను రిలీజ్ చేసింది.
సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం మూడు క్రైటీరియాలను ప్రకటించింది. లబ్ధిదారులు తొలుత పూర్తి ధర చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందాల్సి ఉంటుంది.
ఆ తర్వాత రూ.500పోగా మిగిలిన సొమ్మను 48 గంటల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు అందించింది.