Andhra PradeshHealthPolitical

మద్యం డంప్ ల వెనకున్న అసలు డాన్ కాకాణి గోవర్ధన్ రెడ్డే

మద్యం డంప్ ల వెనకున్న అసలు డాన్ కాకాణి గోవర్ధన్ రెడ్డే

మద్యం డంప్ ల వెనకున్న అసలు డాన్ కాకాణి గోవర్ధన్ రెడ్డే

మంత్రిగా వెలగబెడుతున్నా ఆయన బుద్ధి మారలేదు

2014 ఎన్నికల్లోనూ గోవా మందుతో అమాయకులను చంపాడు. మళ్లీ ఇప్పుడు కూడా లక్షల సీసాలు దించేశాడు

పంటపాళెం, విరువూరులో దొరికిన మద్యం ఎక్కడిది. దుకాణాల నుంచి తెచ్చారా. డిస్టలరీస్ నుంచి దించారా. లేక మళ్లీ గోవా నుంచి తీసుకొచ్చి లేబుళ్లు మార్చారా

మద్యం అక్రమ నిల్వలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి కాకాణిని ఏ1గా బుక్ చేయాలి

జిల్లా పోలీసు కార్యాలయం వేదికగా ఎస్సై శివకృష్ణారెడ్డి, సీఐ రామకష్ణారెడ్డి మాతో పాటు మా అనుచరుల సెల్ ఫోన్లు ట్రాక్ చేసే పనిలో ఉన్నారు

కాకాణికి లబ్ధి చేకూర్చేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఏ అధికారిని వదిలిపెట్టబోను

నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సర్వేపల్లి ఎమ్మెల్యేగా రెండో సారి ఎన్నికై, మంత్రిగా వెలగబెడుతున్నా కాకాణి గోవర్ధన్ రెడ్డి బుద్ది మారలేదు

మళ్లీ జనంతో చెత్త మందు తాగించి చంపేందుకు ప్రమాదకరమైన మద్యాన్ని ఊళ్లలోకి దించేశాడు

ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు డంప్ లు దొరికాయి. ఒకటి ముత్తుకూరు మండలం పంటపాళెం, మరొకటి పొదలకూరు మండలం విరువూరులో

పంటపాళెంలో మద్యంతో చిక్కిన మారు సుధాకర్ రెడ్డి వైసీపీ కీలక నేతే కాక కాకాణి గోవర్ధన్ రెడ్డికి వ్యాపారంలోనూ టోల్ గేటులోనూ భాగస్తుడు

సుధాకర్ రెడ్డి వద్ద 4,232 మద్యం సీసాలు దొరికాయి. వాటిలో వైట్ హాల్ తో పాటు సర్వేపల్లి ఎస్.ఎన్.జే డిస్టలరీలో తయారయ్యే రాయల్ ప్యాలెస్ సీసాలున్నాయి

నిన్న మళ్లీ పొదలకూరు మండలం విరువూరులో వైసీపీ నేత చిర్ల రాజగోపాల్ రెడ్డి రైసుమిల్లులో 2069 బాటిళ్లు చిక్కాయి

పంటపాళెంలో సుధాకర్ రెడ్డితో పాటు ఆయన డ్రైవర్లను కేసులో బుక్ చేశారు. విరువూరులో రైసుమిల్లు యజమాని రాజగోపాల్ రెడ్డితో పాటు కాపాలదారుపైనా కేసు కట్టారు

ఆ 6300కి పైగా మద్యం సీసాలు ఎవరి ప్రయోజనాల కోసం తెచ్చారనే అంశంపై అధికారులు దృష్టి సారించకపోవడం సరికాదు

సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రయోజనం కలిగించేందుకే భారీఎత్తున మద్యం డంప్ చేశారు.

పంటపాళెం, విరువూరులో బయటపడిన మద్యం నిల్వల కేసుల్లో కాకాణిని బుక్ చేయకపోవడం విడ్డూరంగా ఉంది

2014 ఎన్నికల సమయంలోనూ సర్వేపల్లి నియోజకవర్గంలో 4 మద్యం డంప్ లు దొరికాయి.

అప్పట్లో గవర్నర్ పాలనలో ఎక్సైజ్ అధికారులు సమగ్ర విచారణ జరిపి నాలుగు కేసుల్లో కాకాణిని నిందితుడిగా తేల్చారు.

ఎంత ప్రమాదకరమైన మందునైనా తీసుకొచ్చి లేబుళ్లు మార్చి అమాయకుల ప్రాణాలు తీసేందుకు కాకాణి వెనుకాడడు

కల్తీ మద్యం కేసుల్లో కాకాణికి సహ నిందితులుగా పాండిచేరి, బెంగళూరు, చెన్నై, గోవాకు చెందిన మద్యం మాఫియా డాన్లు ఉన్నారు

చెన్నైకి చెందిన ఇంటర్నేషనల్ స్మగ్లర్ అప్పూ ఇదే కేసులో జైలులో ఉంటూ ప్రాణాలు కోల్పోయాడు.

అప్పట్లో నాలుగు డంప్ లు కాకాణి ఇంట్లో దొరక్కపోయినా, అనుచరుల ఇళ్లలో డంప్ చేసినందుకు కేసుల్లో ఆయన పేరు కూడా చేర్చారు

అప్పుడు ఏ పార్టీ పాలన కూడా లేదు. గవర్నర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఆ మందుతో ఎన్నికల్లో పోటీలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రయోజనం కలుగుతోంది కాబట్టి ఆయన్నీ నిందితుడిగా అధికారులు తేల్చారు.

ఇప్పుడు కూడా పంటపాళెం సుధాకర్ రెడ్డి కానీ విరువూరు రాజగోపాల్ రెడ్డి కానీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. వేలాది మద్యం సీసాలను పంచాల్సిన అవసరం వారికి లేదు

ఎస్.ఎన్.జే డిస్టలరీస్ యాజమాన్యాన్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి రాయల్ ప్యాలెస్ బ్రాండ్ తో వ్యాపారం చేస్తున్నాడని మూడేళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు

మొన్న పంటపాళెంలోనూ, నిన్న విరువూరులోనూ ఎక్కువ సంఖ్యలో దొరికింది రాయల్ ప్యాలెస్ మందు బాటిళ్లే

సీజ్ చేసిన మద్యం బాటిళ్లపై బార్ కోడ్ స్కాన్ చేస్తే ఏ దుకాణానికి కేటాయించిన స్టాకో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దిశగా అధికారులు ఎందుకు విచారణ చేయడం లేదు

అసలు స్థానిక డిపోల నుంచి ఈ మద్యాన్ని తీసుకొచ్చారా. లేక మరోసారి గోవా నుంచి ప్రమాదకరమైన మందును తెచ్చి లేబుళ్లు మార్చారా

రెండు నెలల క్రితం 1.44 లక్షల మద్యం సీసాలను పాలిచెర్లపాడు అటవీ ప్రాంతంలో లారీల నుంచి దించి రీప్యాకింగ్ చేసిన తర్వాత ఊళ్లలోని రహస్య ప్రదేశాలకు తరలించినట్టు మాకు సమాచారం ఉంది

మాకు ఈ సమాచారం తెలిసినప్పటికీ ఏమీ చేయలేకపోయాం.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే నాటికి ఏ అధికారి స్పందించే పరిస్థితిలో లేరు. నడిరోడ్డులో ఎదురుగా మనిషిని హత్య చేస్తున్నా పోలీసులు అడ్డుకునే పరిస్థితుల్లో లేరు.

పొదలకూరు మండలం తాటిపర్తి వరదాపురం మైన్ లో పట్టపగలే ఒక ట్రక్కు ప్రమాదకరమైన పేలుడు పదార్థులు చూపించినా ఈ రోజుకి స్పందించిన నాథులు లేరు. ఒక్కరిపై కేసు నమోదు చేయలేదు

జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ ఇప్పుడైనా స్పందించాలి. అప్పుడంటే ఆయనపై రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయి

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి

సీజ్ చేసిన మద్యం సీసాలను కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడి నుంచి తెచ్చారు. వెనుక ఎవరు సహకారం అందించారు. నిబంధనల విరుద్ధంగా వేలాది సీసాల మద్యం బయటకు ఎలా వచ్చిందనే విషయాలను గంటలో తేల్చవచ్చు.

ఈ మద్యం సీసాలతో ప్రయోజనం పొందాలని చూసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఆయన మంత్రి అయితే ఏమీ, సీఎం అయితే ఏమీ

మాకున్న సమాచారం ప్రకారం 3 వేల క్రేట్లకు పైగా మద్యం సీసాలను కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో డంప్ చేస్తే ఇప్పటికి అధికారులు సీజ్ చేసింది 130 క్రేట్లు మాత్రమే

2014లో కాకాణి గోవర్ధన్ రెడ్డి తెప్పించిన గోవా మద్యం అత్యంత ప్రమాదకరమైనదని ఎక్సైజ్ అధికారులు తేల్చారు

ఒక్క సీసా తాగితే అస్వస్థతకు గురవుతున్నారని, రెండు సీసాలు తాగితే పక్షవాతం బారిన పడతారని, మూడో సీసా తాగితే ఏకంగా ప్రాణమే పోతుందని అప్పటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెల్లడించారు.

ఇంత ప్రమాదకరమైన మద్యాన్ని తెచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన అనుచరుల ఇళ్లు, మిల్లుల్లో మళ్లీ మద్యం డంప్ లు దొరుకుతుంటే ఎస్పీ ఎందుకు స్పందించి ఆయనను అరెస్ట్ చేయరు

ఇప్పటికైనా అధికారులు సమగ్ర విచారణ జరిపి కాకాణి ఏ1గా చేర్చాలి.

సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న మద్యం దందాపై రిటర్నింగ్ అధికారితో నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు అందరికీ ఫిర్యాదు చేయబోతున్నాం

జిల్లా పోలీసు కార్యాలయం వేదికగా మా సెల్ ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడేళ్లు ఎస్సైగా పనిచేసిన వ్యక్తిని ఇఫ్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ లో వేయించుకున్నాడు

ఎస్పీ కార్యాలయంలోనే ఉంటున్న ఆ ఎస్సై మాతో పాటు మా అనుచరుల ఫోన్లు ట్రాక్ చేస్తూ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు

మేం ఎవరితో మాట్లాడుతున్నాం. మాతో ఎవరు మాట్లాడుతున్నారు. ఎవరిని కలుస్తున్నాం. మమ్మల్ని ఎవరు కలుస్తున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని కాకాణికి సమాచారం ఇస్తున్నారు

స్పెషల్ బ్రాంచ్ లో ఎస్సై శివకృష్ణారెడ్డి, ఇన్ స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఇదే పనిలో ఉన్నారు. వీరిద్దరూ దగ్గర బంధువులు

సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ మద్యం రవాణా, డంప్ ల నిర్వహణ మొత్తం ఎస్సై శివకృష్ణారెడ్డి పర్యవేక్షణలోనే జరుగుతోంది.

కాకాణికి కొమ్ముకాస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఈ ఇద్దరు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

ఎస్సై శివకృష్ణారెడ్డి వాడుతున్న పర్సనల్ ఫోన్ కాల్ డేటాతో పాటు ఆయన క్రెటా కారు(రిజిస్ట్రేషన్ నంబర్ 10)లో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో గూగూల్ టేకవుట్ తీస్తే బండారం మొత్తం బయటపడుతుంది.

మంత్రికి ఓఎస్డీగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓ సరళ అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని మానిటర్ చేస్తూ కాకాణి కోసం చాలా కష్టపడుతోంది

ఎంపీడీఓల స్థానంలో 20 ఏళ్లుగా ఇక్కడే వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారిని నియమించి స్వామి భక్తి ప్రదర్శించుకుంటోంది. నేను ఈసీకి ఫిర్యాదు చేసే వరకూ జిల్లా అధికారులు స్పందించలేదు

ఎన్నికల నిబంధనల ప్రకారం ఆమె నెల్లూరు జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు అవకాశమే లేదు.

నిబంధనలు ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఏ అధికారిని వదిలిపెట్టబోము.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!