Telangana

నిరుద్యోగులకు అలర్ట్‌.. సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

నిరుద్యోగులకు అలర్ట్‌.. సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌/ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునేవారు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు అయిదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసేందుకు జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే రూ. 100 చెల్లించాలి.

ఎంపిక విధానం : రిక్రూట్‌మెంట్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈపోస్టులకు ఎంపిక చేస్తారు. ఇతర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌నుhttps://scclmines.com/scclnew/index.aspసంప్రదించగలరు.

ముఖ్యమైన తేదీలివే..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయుటకు 15/05/2024 ప్రారంభతేదిగా నిర్ణయించడమైనది.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు 29/06/2024 చివరి తేదీగా నిర్ణయించడమైనది.

మొత్తం పోస్టుల వివరాలివే..

పోస్టుల సంఖ్య మొత్తం : 327

ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు

మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇ & ఎం), ఇ2 గ్రేడ్: 42 పోస్టులు

మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), ఇ2 గ్రేడ్: 07 పోస్టులు

నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు

జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జేఎంఈటీ), టి & ఎస్‌ గ్రేడ్-సి: 100 పోస్టులు

అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్), టి & ఎస్‌ గ్రేడ్-సి: 09 పోస్టులు

అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టి & ఎస్‌ గ్రేడ్-సి: 24 పోస్టులు

ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-I: 47 పోస్టులు

ఎలక్ట్రీషియన్ ట్రైనీ, కేటగిరీ-I: 98 పోస్టులు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button