ఖమ్మం యువతి ప్రతిభ.. ఒకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు…అభినందించిన పోలీస్ కమిషనర్
పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను చేదక్కించుకోవచ్చని విద్యార్థిని కోలపుడి శృతి నిరూపించారని పోలీస్ కమిషనర్ అన్నారు.
ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆవుట్ సోర్సింగ్ పని చేస్తున్న శృతి తల్లి పుల్లమ్మ, తండ్రి పెయింటర్ గా బయట పనులు చేస్తూ జీవనం సాగిస్తూ..తన ఇద్దరి పిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహించడంతో కష్టపడి చదువుకున్నారు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె శృతి ఇటీవల వెలువడిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లో ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ ,గురుకుల స్కూల్ లైబ్రరియన్, EO
వుమెన్ చైల్డ్ వెల్ఫేర్, గురుకుల డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ గారిని కలసిన కుటుంబ సభ్యులను అభినందించారు.
6th నుండి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు వరకు గురుకుల పాఠశాల & కాలేజ్, డిగ్రీ ఫార్మసీ, పీజీ ఎంఏ సోషియాలజీ (ఉస్మానియా యూనివర్సిటీ) మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చదువుకున్నారు.
కార్యక్రమంలొ సిటిసి RI తిరుపతి పాల్గొన్నారు.