పేలిన బస్సు టైర్.. బీఆర్ఎస్ నేతలకు తప్పిన ప్రమాదం…
మేడిగడ్డ కు బస్సుల్లో బయల్దేరి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు
జనగామ సమీపంలో పేలిన బస్సు టైర్
జనగామ జిల్లా:మార్చి 01
కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీతోపాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి.. కుంగిన పిల్లర్లను పరిశీలించిన సంగతి తెలిసిందే.
తాజాగా బీఆర్ఎస్ నేతలు ఛలో మేడిగడ్డ’ పేరిట బస్సుల్లో మేడిగడ్డ సందర్శనకు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తోన్న ఒక బస్సు టైర్ పేలింది. జనగామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి.. టైర్ మార్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రమాదం తప్పడంతో బీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు