ఖమ్మం: మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళన
ఖమ్మం మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల వ్యవధిలోనే మిర్చి క్వింటాలుకు రూ.3వేలు వరకు తగ్గించారని, తగ్గించిన ధరలను పెంచాలని బుధవారం ఖమ్మంలోని మార్కెట్ కార్యాలయం ప్రధాన గేట్లను మూసివేసి బైఠాయించిన రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్కు 50వేల బస్తాలను రైతులు తీసుకువచ్చారు. క్వింటాలుకు గరిష్ఠ ధర రూ20వేల దిగువకు తగ్గించడంతో రైతులు ఆందోళన నిర్వహంచారు.