సంపాదననే లక్ష్యంగా ప్రజాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రవైట్ ఆసుపత్రులు
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలి
నాలుగు రోజులుగా ట్రీట్మెంట్ చేస్తున్న నిలవని ప్రాణం
దాదాపు లక్ష యాభై వేల రూపాయలు కట్టించుకొని డెడ్ బాడీ ఇచ్చారని ఆవేదన
షాద్ నగర్ పట్టణంలోనీ ప్రవేట్ ఆసుపత్రులలో అసలు ఏం జరుగుతుంది .?
ఆస్పత్రిలో చేరితే చాలు శవమై తిరిగి వస్తున్నారు.
ఇలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి.
ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులు ఓ కన్నేయండి.
శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ( సి.కె న్యూస్ )
షాద్ నగర్ టౌన్ కేంద్రంలో బుగ్గ రెడ్డి ఆస్పత్రి లో వైద్యం వికటించి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. షాద్ నగర్ టౌన్ కేంద్రంలో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులను సంప్రదిస్తే తమ ఆరోగ్యం కుదుటపడుతుందని
కోటి ఆశలతో వస్తే వైద్యం కోసం వేల రూపాయలను వెచ్చించినగాని ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. నిత్యం ప్రవేట్ ఆసుపత్రులలో వైద్యం వికటించి మృతి చెందిన వైద్యశాఖ అధికారులు మాత్రం తమకు పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ లోని చటాన్ పల్లి కి సంబంధించిన నాగేశ్వర రావు (60) అనే వ్యక్తి అతను ఒక పురోహితుడు శ్వాసాకు సంబంధించిన సమస్యతో స్థానిక పట్టణ కేంద్రంలో బుగ్గారెడ్డి ఆసుపత్రిలో చేరాడు. దీంతో నాలుగు రోజులుగా ట్రీట్మెంట్ కోసం 1,50,000 రూపాయలను వసూలు చేశారని తీరా చూస్తే శవాన్ని అప్పగించారని కుటుంబంలో ఆరోపించారు.
తమకు చిన్న సమస్య ఉందని డాక్టర్లు వైద్యం అందిస్తే కుదుటపడుతుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. నేడు తీరా చూస్తే నిండు ప్రాణం బలికొన్నారని వాపోయారు. హెల్త్ బుల్లెట్ లో అతడి ఆరోగ్యం విషమంగా ఉందని ముందే వైద్యులు సూచించి ఉంటే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించి ఉంటే బ్రతికి ఉండేవాడని అభిప్రాయపడ్డారు.
ఆస్పత్రి నిర్లక్ష్యం వైఖరితోనే నిండు ప్రాణం బలైందని, ఇటువంటి ఆస్పత్రులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తే ప్రాణాలు పోకుండా కాపాడుకునేవాళ్లమని కుటుంబీకులు వాపోయారు.
పట్టణ కేంద్రంలోని కొన్ని ఆస్పత్రిలో ప్రజల ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్యశాఖ అధికారులు పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారని,దానికి తోడు పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రి యజమాన్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి ఆస్పత్రుల లైసెన్సులు రద్దుచేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.