హైదరాబాద్ లో హై అలర్ట్…
బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన బాంబ్ బ్లాస్ట్‌తో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. మూడు కమిషనరేట్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్‌లను అప్రమత్తం చేశారు.
అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా పెంచారు. స్థానిక పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, ఎంజీబీఎస్, జూబ్లీబస్ స్టేషన్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లతోపాటు రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేశారు.
వెహికల్‌చెకింగ్ చేపట్టారు. గతంలో బ్లాస్టింగ్స్ జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని మోహరించారు. అనుమానాస్పద వ్యక్తల కదళికలపై నిఘా పెట్టారు.
ఎలాంటి సమాచారం తెలిసినా డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకనే లోనికి అనుమతించారు.