భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతారు అన్న ప్రచారంతో బగ్గుమంటున్న కాంగ్రెస్ నాయకులు
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),
మార్చ్ 06, భద్రాచలం. బి ఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావ్ కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారంతో వెంకట్రావు రాకను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్ర రావు చేసిన వ్యాఖ్యలను ఖండించిన భద్రాచలం కాంగ్రెస్ నాయకులు.
మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పొదెం వీరయ్య భద్రాచలం అభివృద్ధిపై దృష్టి సారించలేదని, గత ప్రభుత్వ సేవలను వినియోగించు కోకుండా నిర్లక్ష్యం చేశారని వెంకట్రావు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.బి ఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెంకట్రావు దిష్టిబొమ్మను దగ్ధంచేసిన భద్రాచలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.
భద్రాచలం అభివృద్ధి కోసం దేనికైనా సిద్ధం అంటున్న వెంకట్రావ్ చొక్కాలు మార్చినట్టు పార్టీలను మారుస్తున్నాడు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి,గత బి ఆర్ఎస్ ప్రభుత్వ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఉన్న నాయకుడు పొదెం వీరయ్య.స్వలాభాల కోసం దేనికైనా సిద్ధమంటున్న వెంకట్రావ్ కు పొదెం వీరయ్యను విమర్శించే స్థాయి,అర్హత లేదని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ నాయకులు.