మహిళ నెత్తి పగలగొట్టిన రేషన్ డీలర్
రేషన్ బియ్యంలో రాళ్లు వస్తున్నాయని అడిగిన మహిళ
కరెంటు బోర్డుతో విసిరి తలపై కొట్టిన వైనం
గాలిగూడా గ్రామ నంద్యా నాయక్ తండాలో ఘటన
రేషన్ పొందాలంటే డీలర్ తో దెబ్బలైన, మాటలైన పడాల్సిందే అంటున్న తాండా వసూలు
డీలర్ రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్నడని ఆరోపణలు ఉన్నాయి
జిల్లేడ్ పోలీసులకు పిర్యాదు చేసిన మహిళా
రేషన్ డీలర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరి గూడ మండలంలోని నంద్యా తండాలో దారుణానికి ఒడిగట్టాడు ఓ రేషన్ డీలర్ నాణ్యమైన బియ్యం ఇవ్వమన్నందుకు నన్నే ప్రశ్నిస్తావ అంటూ ఓ మహిళపై కరెంట్ బోర్డ్ తో తలపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పిర్యానాయక్ పై గతంలోనే రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నడని ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం పొందాలంటే తిట్లు, దెబ్బలు తినాల్సిందే అంటున్నారు తండాకు చెందిన కొంతమంది.
ఇక వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా నంద్యా నాయక్ తండాకు చెందిన పిర్యానాయక్ గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ షాప్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
మూడవ తరీకు శనివారం 2024 రోజు అదే తాండకు చెందిన రుక్కమ్మ రేషన్ సరుకుల కోసం వెళ్ళింది.బియ్యం తీసుకునే క్రమంలో బొయ్యంలో రాళ్లు ఉన్నాయని బస్తా మార్చి ఇవ్వాలని కోరడంతో నీకు అవి ఇవ్వటమే ఎక్కువ అంటూ వాగ్వాదానికి దిగాడు.
కేంద్ర ప్రభుత్వం నాణ్యత కలిగిన రేషన్ బియ్యాన్ని ఇస్తుంటే మీరు బియ్యాన్ని నాణ్యత లేకుండా అందించడం సరికాదని అనడంతో పక్కన ఉన్నటువంటి విద్యుత్తు వైర్ బాక్స్ తో రుక్కమ్మ అనే మహిళా తలపై బాదుడు రేషన్ డీలర్ పిర్యానాయక్ అంతటితో ఆగకుండా నువ్వు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో మళ్ళీ వస్తే చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నడని జిల్లేడ్ చౌదరి గూడ పోలీసులకు మహిళా పిర్యాదు చేసింది.
పిర్యాదు అందుకున్న పోలీసులు ఐపీసీ 341,323,504,506, సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి రేషన్ బియ్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న పిర్యానాయక్ లైసెన్స్ రద్దు చేయాలని తాండా వసూలు కోరుతున్నారు.