ప్రార్థించే పెదవుల కన్న సహాయం చేసే చేతులు మిన్న
మీగడం పాడు తండాలో కాలి బూడిద ఐన ఇల్లు
సర్వం కోల్పోయిన పేద రైతు
బాధితునికి అండగా మేమున్న మంటు ముందుకొచ్చిన సహృదయులు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 09
అకస్మాత్తుగా మంటలు లేసి ఇల్లు మొత్తం కాలిపోయి ఇంట్లో ఉన్న వస్తువులు బూడిద ఐన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది.వివరాలకు వెళితే మిగడం పాడు తండా కు చెందిన బుక్య బాబు అనే పేద రైతు కుటుంబం మొత్తం శివరాత్రి జాతరలో ఉండగా అకస్మాత్తుగా వారి ఇంట్లో మంటలు లేసి ఇంట్లో ఉన్న వస్తువులు పొలం పాస్ పుస్తకాలు బట్టలు మొత్తం కాలి బూడిదయ్యాయి.సమాచారం మేరకు ఎంపీపీ గోపాల్ నాయక్ హుటాహుటిన బాధితుడు ఇంటికి వెళ్లి జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నాడు తన వంతు సహాయంగా 10,వేలు అందజేయడంతో పాటు వారికి భరోసాగా నేనున్నానంటూ పేద రైతు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ఇట్టి విశయాన్నీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి వారికి సాయం అందేలా చూస్తానని తెలిపారు.
అదేవిధంగా సంఘటనకు చలించిన పలువురు మనవత్యంతో ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసిన వారు బెల్లంకొండ నర్సింహారావు 5 వేలు
బదా నాయక్ 5, వేలు
భూక్యా చందు.3 వేలు
రామారావు 2 వేలు
శ్రీను 2 వేలు
మరి కొందరు గ్రామస్థులు ఒక్కొక్కరు 1000 రూపాయల చొప్పున మొత్తం 50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.