షాద్ నగర్ నియోజకవర్గ ప్రజల సహకారం కోరుతున్నా..
మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి
వంశీచంద్ రెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరులు
నిజాయితీపరుడు, సమర్ధుడు, మేధావి చల్లా వంశీచంద్ర రెడ్డి
వంశీచంద్ రెడ్డికి భారీ మెజార్టీ అందిస్తాం
త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని ప్రకటించిన ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం : మార్చ్ 10( సి.కె న్యూస్)
పాలమూరు ప్రజల గొంతును పార్లమెంటులో వినిపిస్తానని, ప్రజలకు నిరంతరం అండగా ఉంటానని మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిడబ్ల్యుసీ సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు.
ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశి చంద్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలతో ఆయన పూర్తి సహకారంతో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆశీస్సులతో పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా తన అభ్యర్థిత్వాన్ని ఎఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల్లో కార్యకర్తల పూర్తి సహకారంతో విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను భారీ మెజార్టీతో కార్యకర్తలు వివిధ విభాగాల శ్రేణులు గత ఎన్నికల్లో సంపూర్ణ సహకారం ఎలా అందించారో తనకు కూడా అలాగే సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సహకారం కోసం తను ఇక్కడికి వచ్చానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల సహకారం ఉంటే కాంగ్రెస్ గెలుపు తధ్యమని వంశీచంద్ రెడ్డి అన్నారు. పాలమూరు ప్రజా గొంతును పార్లమెంటులో వినిపిస్తానని పాలమూరు అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. తన గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వంశీచంద్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు కోసం కుటుంబాలకు కూడా సమయం ఇవ్వకుండా కేవలం ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే వ్యక్తుల్లో వంశీధర్ రెడ్డి, తాను ఉన్నామని అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. పునరేకికరణ కోసం పార్టీ జవసత్వాలు నింపేందుకు భారీ ప్రణాళికలు చేపట్టబోతున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరుల సహకారంతో పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేస్తామని స్పష్టం చేశారు.
ఒకటి రెండు మండలాల్లో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయని అన్నారు. అక్కడక్కడ కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయని వాటిని కూడా తొక్కిపెట్టి బలమైన రాజకీయ పార్టీగా కాంగ్రెస్ అవతరించేందుకు కృషి చేస్తానని అన్నారు. సమస్యలను అధిగమించి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో గ్రామస్థాయి నుండి నియోజకవర్గస్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వంశి చంద్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఎవరు ఊహించని మెజారిటీ అందజేస్తామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పార్లమెంటు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఖచ్చితంగా రాబోయే తరానికి మంచి రాజకీయ వేదిక కాంగ్రెస్ పార్టీ అవుతుందని అందరికీ అన్ని అవకాశాలు వస్తాయని సమయానూకూలంగా స్పందిస్తామని అన్నారు.
వంశీ చంద్ రెడ్డి మంచి పనిమంతుడని సమర్ధుడు మేధావి నిజాయితీపరుడని ఇలాంటి వ్యక్తులను సమాజంలో గెలిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని గతంలో పనిచేసిన పార్లమెంటు సభ్యులు ఒక్కరు కూడా పాలమూరు గళాన్ని పార్లమెంటులో వినిపించలేదని కానీ వంశీ చంద్ రెడ్డి మంచి యువకుడనీ తన గళాన్ని పాలమూరు ప్రజల కోసం వినిపించడం ఖాయమని అన్నారు.
గతంలో నోట్లో నాలుక లేని వ్యక్తులను పార్లమెంటుకు గెలిపించి పొరపాటు చేశారని అలాంటివి జరగవని ఇకపై తెలంగాణ రాష్ట్రానికి కాదు పాలమూరుకు కూడా మంచి భవిష్యత్తు ఉండబోతుందని శంకర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, రఘునాయక్, బాబర్ ఖాన్, బాలరాజ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, కొత్తూరు మండల అధ్యక్షుడు,హరినాథ్ రెడ్డి, ఫరూక్నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నందిగామ మండల అధ్యక్షుడు జంగ నరసింహ, చౌదరిగుడా మండల అధ్యక్షుడు రాజు, కేశంపేట్ మండల అధ్యక్షుడు వీరేశం, తిరుపతి రెడ్డి, బస్సులమప్ప, మరియు ఎంపీటీసీలు సర్పంచులు సింగిల్విండో డైరెక్టర్లు చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. వంశీచంద్ రెడ్డిని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు ఘనంగా సన్మానించారు.