Andhra PradeshPolitical

సర్పంచ్ భర్త అనుమానస్పద మృతి

వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ భర్త అనుమానస్పద మృతి

ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది.గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద మృతి చెందాడు. ఆయన మృతికి బెట్టింగ్ లే కారణంగా తెలుస్తోంది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడు. భార్య సర్పంచి. వీరు వైకాపా మద్దతుదారులు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా గెలుస్తుందని వేణుగోపాలరెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకు పందెం వేశారు.

ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. పందెం వేసిన వారు ఫోన్లు చేసినా స్పందించకపోవడం..

గ్రామంలో లేకపోవడంతో ఈ నెల 7న పందెం వేసినవారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు.

ఈ క్రమంలో మరుసటిరోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగు మందు తాగారు. మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గత కొద్ది రోజులుగా తన భర్త మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్లు మృతుడి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button