మాటిచ్చారు.. తీవ్ర సమస్య తీర్చారు..
– మంత్రి పొంగులేటి చొరవతో చౌటపల్లి రైతుల తిప్పలకు పరిష్కారం
కూసుమంచి మండలం : మంత్రి పొంగులేటి మాటిచ్చారంటే ఆ పని పూర్తవ్వాల్సిందే. అందుకు చౌటపల్లి గ్రామంలో ఘటన ఓ చిన్న ఉదాహరణ. రాష్ర్టరెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలక్షన్ ప్రచారoలో భాగంగా రైతులు నిత్యం పొలాలకు వెళ్ళే రహదారి మూళ్ళ కంపలతో కమ్ముకొని గుంతల మాయం కాగా, గత ప్రభుత్వం లో ఏన్నోసార్లు ఎంతోమంది నాయకులకు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది .. పొంగులేటి శ్రీనివాస్ రేడ్డి ఎలక్షన్ ప్రచారా భాగాoలో స్థానికులు కలిసి మాకుR&B రోడ్ నుండి చెరువు కట్టా వరకు సీసీరోడ్ కావాలని కోరగా .. దీంతో వారు స్పందించి పాలేరు ఎమ్మెల్యే గా గెలిచినా సందర్బంగా mg n r egs ద్వారా 16/- లక్షల రూపాయలు మంజూరు చేయించి చౌటపల్లి R&B రోడ్ నుండి చౌటపల్లి చెరువు కట్టా వరకు cc రోడ్ శాంక్షన్ చేశారు ఈ రోజు ఆ పనిని పొక్లేయిన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. గుంతలు ఉన్న రోడ్ ను మట్టి తో పూడ్చి చుట్టూ ఉన్న ముల్ల కoచెను తొలగించే పనులు ప్రారంభించారు. దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించిందని ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ సర్పంచ్ కందాల రవి, పెద్దిరెడ్డి, నందిపాటి ఉప్పయ్య ,మక్కా కృష్ణ,గుమ్మాడెల్లి రాజు,గండు రామన్న, తురక కాషాయ్యా గారు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానికులందరు కలిసి మంత్రి పొంగులేటికి తమ కృతజ్ఞతలు తెలిపారు.