EducationNotificationTelangana

పీజీఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల…

పీజీఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల..

పీజీఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల..

అప్పటినుంచే దరఖాస్తుల స్వీకరణ..

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు వరుస గుడ్ న్యూసులను చెబుతుంది.. 2024-25 ఏడాదికి గానూ వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు స్టేట్‌ పీజీఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ తాజాగా విడుదల చేసింది.
ఈ పరీక్షలను జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించనున్నారు..

పీజీఈసెట్‌ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ పరీక్షలకు అర్హులైన వారు మార్చి 16 నుంచి అప్లై చేసుకోవచ్చు.. ఈ పరీక్షల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పరీక్షల ద్వారా మొత్తం 19 విభాగాల్లో ప్రవేశాలు ఉంటాయి.. ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, జియో-ఇంజినీరింగ్ అండ్‌ జియో-ఇన్ఫర్మాటిక్స్‌, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్స్‌టైల్ టెక్నాలజీలో ప్రవేశాలు ఉన్నాయని నోటిఫికేషన్ లో తెలిపారు..

అర్హతలు..

ఈ పరీక్షలకు అర్హతలు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 10, 2024వ తేదీ వరకు ఎలాంటి ఆలస్యం రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు..

అప్లికేషన్ ఫీజు..

జనరల్ అభ్యర్ధులు రూ.1100 , ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.600 తప్పనిసరిగా చెల్లించాలి. హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు..

ఇకపోతే రూ.250 నుంచి రూ.5 వేల ఆలస్య రుసుముతో
దరఖాస్తులకు చివరి తేదీ: మే 14 నుంచి 25 వరకు, 2024… హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభ తేదీ: మే 28

19 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్షలు: జూన్‌ 6 నుంచి జూన్‌ 9 వరకు, 2024 పరీక్షలను నిర్వహించనున్నారు.. ఈ పరీక్షల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button