అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఎస్సై ఎం రామాంజనేయులు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 14
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాలకు పాల్పడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొనబడునని ఎస్సై ఎం ఆంజనేయులు అన్నారు
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ట్రాలీ వాహనాన్ని ఎస్సై రామాంజనేయులు పట్టుకున్నారు. తెల్లవారు జామున సుమారు 04.45 గంటల సమయంలో AP-39UG-9896 నెంబర్ గల ట్రాలీ వాహనంతో గుండ్లపల్లి గ్రామానికి చెందిన దవనం పద్మ భర్త శ్రీనివాస్ అను ఆమె గురువారం 60 బస్తాల (30 క్వింటాల్ సుమారుగా) రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎస్సై రామాంజనేయులు వారి సిబ్బంది పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, నేరస్తురాలు దవనం పద్మ మరియు వాహనం నడుపు డ్రైవర్ పరారిలో ఉన్నారని మండలంలో ఎవరైనా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడునని అన్నారు.