మృతదేహంతో రోడ్ పై బైఠాయించి నిరసన
వెలుగులోకి నమ్మలేని నిజాలు…
సికె న్యూస్ ప్రతినిధి భార్గవ్ వెంకటాపురం
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ ఉమెన్స్ హాస్టల్లో లో ములుగు జిల్లాకి చెందిన సాహితి అనుమానాస్పద మృతి పట్ల ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న నమ్మలేని నిజాలు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన, సుంకరి వెంకటసుబ్బారావు కుమార్తె సుంకరి సాహితి మృతికి కారణం.!
వెంకటాపురం గ్రామానికి చెందిన ( PSES ) చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ సీనియర్ నాయకుడు చిడెం.మోహన్ రావు, తనయుడైన చిడెం. హరీష్’ తండ్రి కొడుకుల బెదిరింపుల కారణంగానే సాహితి బలోపిత మరణానికి పాల్పడ్డదని హైదరాబాద్ ఉమెన్స్ హాస్టల్ లో సాహితి క్లాస్మేట్స్ వెల్లడించారు.
సాహితి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేకూర్చాలి, we want justice అనే నినాదాలతో సాహితి సొంత గ్రామానికి చెందిన వెంకటాపురం మండల జాతీయ రహదారిపై, సాహితి భౌతికయంతో ఇలాంటి రాజకీయాలకి ఏ ఆడపిల్ల జీవితం చీకటి కావద్దని, కొవ్వొత్తుల వెలుగులో భారీ ర్యాలీ నిర్వహించారు కుటుంబసభ్యులు.
అధికార పార్టీ అండ చూసుకొని ఏం చేసుకుంటారో.! చేసుకోండి అని, సాహితిని, సాహితి తల్లిదండ్రులకు, ఫోన్ ద్వారా బెదిరింపు చర్యలకు పాల్పడ్డా ఇలాంటి కీచక రాజకీయ నేతలకు, మళ్లీ రాజకీయ భవిష్యత్తు కల్పించనుందా.! ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.! అనే విషయం ములుగు జిల్లాలో పలు పార్టీ నాయకులలో చర్చనీయాంశం గా మారింది.