అక్రమ ఇసుక రవాణా కి అడ్డుకట్ట వేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి హామీకి తూట్లు బోడుస్తున్న స్థానిక అధికారులు. కాల పరిమితి అయిపోయిన తూరుబాక ఇసుక ర్యాంపులో లూటీ అవుతున్న ప్రజా సంపద… యదేచ్ఛగా సాగుతున్న జీరో బండ్ల దందా అనుమతులను మించి డంపు చేసిన ఇసుక. అనుమతి లేకుండా అదనపు డంపింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన వైనం. పట్టించుకోని మండల రెవిన్యూ అధికారులు చోద్యం చూస్తున్న టిఎస్ఎండిసి , మైనింగ్ అధికారులు. …

అక్రమ ఇసుక రవాణా కి అడ్డుకట్ట వేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలి.

ముఖ్యమంత్రి హామీకి తూట్లు బోడుస్తున్న స్థానిక అధికారులు.

కాల పరిమితి అయిపోయిన తూరుబాక ఇసుక ర్యాంపులో లూటీ అవుతున్న ప్రజా సంపద…

యదేచ్ఛగా సాగుతున్న జీరో బండ్ల దందా

అనుమతులను మించి డంపు చేసిన ఇసుక.

అనుమతి లేకుండా అదనపు డంపింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన వైనం.

పట్టించుకోని మండల రెవిన్యూ అధికారులు

చోద్యం చూస్తున్న టిఎస్ఎండిసి , మైనింగ్ అధికారులు.

కలెక్టర్ స్పందించి లూటీ ప్రజా సంపదను కాపాడాలి.

రెన్యువల్ లేకుండా నడుపుతున్న తూరుబాక ఇసుక ర్యాంపుని రద్దు చేయాలి.

సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),

మార్చ్ 15,

భద్రాచలం పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాన్ని నిలిపివేస్తానని గౌరవ ముఖ్య మంత్రి వర్యులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు

దుమ్ముగూడెం మండలంలో తూరుబాకలో ఉన్న ర్యాంపు లో ప్రజా సంపద అయిన ఇసుక లూటీకి గురవుతుందని ఆరోపించారు ఈ ర్యాంపు పరిమిషన్ అయిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పుడు కూడా ఇసుక తోలకాలు జరుగుతున్నాయని అన్నారు కాల పరిమితి అయిపోయిన ర్యాంపు ఏ విధంగా కొనసాగుతుందని ప్రశ్నించారు

అనుమతికి మించిన ఇసుకను డంపు చేశారని జీరో బండ్ల ద్వారా అక్రమంగా ఆ ఇసుకను తరలిస్తున్నారని అన్నారు డంపు పాయింటు అనుమతి ఒకచోట ఉంటే అదనంగా రెండు చోట్ల డంపింగ్లు పాయింట్లు చేస్తున్నారని అన్నారు ఇంత జరుగుతున్న మండల రెవెన్యూ అధికారులు టిఎస్ఎండిసి మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం సూచనీయమని అన్నారు

మండలంలో చిన్నచితిక ఒకటి రెండు ట్రక్కుల ఇసుక అక్రమంగా స్థూలకాలు జరిపితే స్పందిస్తున్నటువంటి మండల రెవెన్యూ అధికారి లారీలకు లారీల ఇసుక అక్రమంగా తరలి వెళ్తుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు ఈ ర్యాంపుకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు వాటికి సంబంధించినటువంటి వివరాలు బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు

ఇప్పటికైనా తక్షణం కలెక్టర్ స్పందించి జరుగుతున్న ఈ ప్రజా సంపదలు ఊటీని ఆపాలని కాల పరిమితి అయిపోయిన తూర్బాక ఇసుక ర్యాంపుని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల కచ్చితంగా పోరాటాల నిర్వహిస్తామని హెచ్చరించారు పార్టీ నాయకులు దాసరి సాయన్న ,మునిగల శివ, బోడా.సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Updated On 15 March 2024 7:54 PM IST
cknews1122

cknews1122

Next Story