ఓ వ్యక్తి పై గొడ్డలితో తండ్రి కొడుకులు డాడీ
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 20
సూర్యాపేట జిల్లా
హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండలంలో నిన్న అర్ధరాత్రి ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన చోటచేసుకుంది
ఎస్సై పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం
మేళ్లచెరువు మండలానికి చెందిన గోపిశెట్టి శంకర్ మరియు అతని కుమారుడు మణి ఇద్దరు కలిసి చింతలపాలెం మండలానికి చెందిన షేక్ షంషీద్ అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయగా అతని చెవి భాగానికి తీవ్ర గాయాలు కాగా అతను హుటా హుటిగా మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ కీ వెళ్ళి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి అతనిని వైద్య చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం కోదాడలోని వైష్ణవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇట్టి విషయమై ఎస్ఐ పరమేష్ మాట్లాడుతూ దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని తెలిపారు.