ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత మృతి
అచ్చంపేట అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన మేడమోని కల్పన (29) అనే గర్భిణీ ప్రసవం కోసం శుక్రవారం కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్ తన ప్రైయివేటు ఆస్పత్రికి వెళ్లకుండా ప్రభుత్వాస్పత్రికి వచ్చిందని అక్కసుతో ప్రసవం చేయకుండా నిరాకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
భార్య ఆవేదన చూసి భర్త ఆంజనేయులు ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. తీవ్ర రక్తస్రావానికి గురి కావడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాట్లు సమాచారం.
అక్కడ కూడా వైద్యం అందకపోవడంతో హైదరాబాద్ తరలిస్తుండడంతో కల్పన మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. సంబంధించిన డాక్టరు బాధిత కుటుంబాలతో చర్చించి , విషయం బహిర్గతం కాకూడదు అనే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.