గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎస్సై పరమేష్
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మార్చి 27
మేళ్లచెరువు గ్రామంలోని మై హోమ్ సిమెంట్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ పరమేష్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లగా ఆ వ్యక్తి వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అతనిని పట్టుకొని అతని వద్ద తనిఖీ చేయగా ఒక పాలిథిన్ కవర్లో 200 గ్రాములు ప్రభుత్వ నిషేధిత గంజాయి దొరికింది
వెంటనే ఎస్ఐ అతని విచారించగా అతని పేరు గోల్డెన్ కుమార్, బీహార్ రాష్ట్రానికి చెందిన వారిని అతను మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో గత రెండు నెలల నుండి కూలిగా పని చేయుచున్నాడు
వెంటనే ఎస్ఐ అతనిని అతని వద్దనున్న గంజాయిని పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి క్రైమ్ నెంబర్ 55 / 2024, యు ఎస్, 20 బి ఐఐ ఏ ఆఫ్ ఎన్డీఎస్ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయగా బుధవారం సిఐ రజిత రెడ్డి సదరు వ్యక్తిని రిమాండ్ చేసి కోర్టుకు పంపించారు.