ఖరారు కానీ కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి
ఈ నెల 31 అయిన ఖరారు అయ్యేనా?
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ స్థానం హాట్ సీట్గా మారింది. ఎక్కువమంది పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎవరిని బరిలో దించాలన్న అంశం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తమకు సంబంధించిన అభ్యర్థులకు సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
భట్టి తన సతీమణి నందిని కోసం, పొంగులేటి తన సోదరుడు ప్రసాదొడ్డి కోసం, తుమ్మల తన కుమారుడు యుగం ధర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.
వీరితో పాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వంకాయల పాటి రాజేంద్రప్రసాద్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్లు సైతం తమకు ఖమ్మం సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం అభ్యర్థి ప్రకటన వాయిదా పడుతోందని చెబుతున్నారు.