ఖమ్మంలో సుగుణ హాస్పిటల్ సీజ్….
ఖమ్మంలో అనుమతుల్లేని ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడా ఝులిపిస్తున్న వైద్యారోగ్య శాఖ..
ఖమ్మంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఔషధ నియంత్రణ శాఖా సంయుక్త అధ్వర్యంలో తనిఖీలు…..
వరుస తనిఖీలతో అనుమతుల్లేని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల వెన్నుల్లో వణుకు..
ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవoటూ ఇరు శాఖాల హెచ్చరిక..
ఖమ్మంలో అనుమతుల్లేని ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడా ఝులిపిస్తున్న వైద్యారోగ్య శాఖ..
నాలుగు కాసులున్నాయా..! అయితే ఇంకేం….! ఖమ్మం డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్స్ లో ఆనాలుగు కాసులను గుమ్మరిoచి.. వైద్యం పేరుతో మూడు ఓపిలు, ఆరు సర్జరీలతో వైద్య వ్యాపారం విరాజిల్లుతోంది…
అక్రమంగా, అడ్డదారుల్లో.. ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి అంతా మాదే రాజ్యం…అంటూ… ఇష్టారాజ్యంగా వ్యవహరించే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఔషధ నియంత్రణశాఖ సoయుక్త ఆధ్వర్యంలో గురువారం రాత్రి తనిఖీలు ముమ్మరం చేశాయి.. ఫలితంగా ఖమ్మంలో సుగుణ హాస్పిటల్ సీజ్….అయింది… ఖమ్మం జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో త్రొక్కుతూ..వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే…వైద్య సేవ రూపంలో కొనసాగుతున్న తమ సేవలు పూర్తిగా వ్యాపారంగా మారాయా…? అంటే… కొన్ని ప్రైవేట్ వైద్యశాలలవ్యవహార శైలికి వ్యాపారం అనే పదం కరెక్ట్ సూట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు…
తమ వద్దకు వచ్చిన రోగికి సరైన సమయంలో చికిత్స గుర్తించి తీసుకొచ్చే విధంగా ఇంటికి పంపించే ఆస్పత్రిలో ఖమ్మం జిల్లా కేంద్రంలో కొన్ని ఆస్పత్రిలు మాత్రం వైద్య సేవలు వ్యాపారం ధ్యేయంగా తలుచుకుంటూ వివరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవహిస్తూ వ్యవహరిస్తూ అబార్షన్ అనుమతులు లేకపోయినా ప్రభుత్వా నిబంధనలను వ్యతిరేకంగా అబార్షన్లు చేస్తూ మహిళలకు మెడిసిన్ను ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆస్పత్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ పై వైద్యానికి శాఖ ఔషధ నియంత్రణ శాఖ దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ ప్రాంతంలో సుగుణ హాస్పిటల్ ను సీజ్ చేసింది గత వారం రోజుల క్రితం వారం రోజులుగా ఖమ్మం నగరంలో నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రిలను కొన్నింటిని సీజ్ చేసిన విషయం మీదనే అయినప్పటికీ ధనార్ధనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల వ్యాపారాలకు కళ్లెం వేసేందుకు వైద్య అరోగ్యశాఖ నడుం బిగించిందని చెప్పవచ్చు..
మరి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో గర్భంలోనే శిశువును ఆడ..మగ..అని నిర్ధారిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తూ. ..శిశువు ఆడ శిశువు అని నిర్ధారణ అయితే అబార్షన్లు నిర్వహిస్తున్న కొన్ని హాస్పిటల్స్ తీరును పసిగట్టిన ఈ రెండు శాఖలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హాస్పటల్ మూసివేసే చర్యలకు ఉపక్రమించారు..
ఖమ్మం జిల్లా కేంద్రంలోని చర్చి కంపౌండ్ ప్రాంతంలోగల సుగుణ హాస్పిటల్ లో హార్మోన్స్ పెంచే ఔషధ మెడిసిన్ లను ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచుతూ.. ఆ ఔషధాలను విక్రయిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ తెలుసుకొని అదేవిధంగా అబార్షన్లు పాల్పడుతున్న ఈ ఆసుపత్రి తీరుపై ఆ రెండు శాఖల సమన్వయంతో తనిఖీలుచేశాయి.
ఈ క్రమంలో సుగుణ ఆసుపత్రి ఆసుపత్రిని సీజ్ చేశాయి.. దీంతో ఖమ్మం నగరంలో అనుమతి లేని. కొన్నిఆసుపత్రిల యాజమాన్యాలకు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే కొన్ని ప్రైవేటు ఆసుపత్రిల అధినేతల వెన్నుల్లోవణుకు పుట్టినట్లయింది..
ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ నిబంధనలు కనుగుణంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని, ప్రభుత్వం అవగాహన కార్యక్రమాల పేరుతో చెబుతున్నప్పటికీ వినిపించుకోని కొన్ని ప్రైవేటు వైద్యశాలకు సీజు అనే పేరుతో ఇలాంటి గతే పడుతుందని ఐరుశాఖల ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ ఐపీఎస్ యువరాజ్, మౌనిక,ఇంచార్జి డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సైదులు, డి ఎస్.నవీన్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఉపేందర్, వన్ టౌన్ పోలీసులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..