కొత్తగా ఎన్నికైన బార్ అసోసియేషన్ కమిటీలకు అభినందనలు..
కొత్తగా ఎన్నికైన బార్ అసోసియేషన్ కమిటీలకు అభినందనలు.. సమస్యల సాధనకు ఐక్యంగా కృషి చేయాలి. మామిడి వెంకట్ రెడ్డి ఐలు జిల్లా అధ్యక్షులు పిలుపు సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 29 ఈనెల 28న కొత్తగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు కమిటీలకు అభినందనలు తెలియజేస్తూ కోర్టులలో పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని ఐలు జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.. భువనగిరి అధ్యక్ష కార్యదర్శులు …

కొత్తగా ఎన్నికైన బార్ అసోసియేషన్ కమిటీలకు అభినందనలు..
సమస్యల సాధనకు ఐక్యంగా కృషి చేయాలి.
మామిడి వెంకట్ రెడ్డి ఐలు జిల్లా అధ్యక్షులు పిలుపు
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 29
ఈనెల 28న కొత్తగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు కమిటీలకు అభినందనలు తెలియజేస్తూ కోర్టులలో పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని ఐలు జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు..
భువనగిరి అధ్యక్ష కార్యదర్శులు బబ్బూరి హరినాథ్,ప్రధాన కార్యదర్శి కుక్కదువు కృష్ణ,రామన్నపేట అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ మజీద్,కెమా రామదాసు,ఆలేరు అధ్యక్షుడు జూకంటి రవీందర్,చౌటుప్పల్ అధ్యక్ష కార్యదర్శులు ఉడుగు శ్రీనివాస్,రాపోలు వేణు మరియు అన్ని బార్ అసోసియేషన్స్ ఆఫీస్ బేరర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా కమిటీ శుభాభివందనాలు తెలియజేశారు.
జిల్లాలోని వివిధ కోర్టు సముదాయాలకు సొంతభవనాలు,కోర్టులలో సరియైన సిబ్బంది లేక,ఉన్న కోర్టులలో మౌలిక సదుపాయాలు న్యాయవాదుల విశ్రాంతి గదులు,మంచినీరు, మరుగుదొడ్లు, లేక క్లైంట్లు మరియు లాయర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,
స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పై స్థాయి జడ్జిల దృష్టికి తీసుకుపోయి సమస్యల సాధనకు కృషి చేయాలని జిల్లాలో పెరుగుతున్న క్రైమ్ రేటు ను తగ్గించేందుకు బార్ మరియు బెంచ్ సమన్వయంతో కృషి చేయాలని అన్ని కమిటీలు ఐక్యంగా ముందుకు పోయి విజయాలు సాధించాలని ఆయన కోరారు..
