సీఎం కు అస్వస్థత!
లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.
మంగళవారం ఆయన షుగర్ లెవల్స్ పడిపోయాయి. దీంతో ఆయనకు వైద్యులు మెడిసిన్స్ అందించారు. ఇదిలా ఉండగా అనారోగ్యం కారణంగా ఆయన 4.5 కిలోల బరువు తగ్గిపోయినట్లు సమాచారం.
మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఏప్రిల్ 15 వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తిహాడ్ జైలుకు తరలించడంతో సీఎం పదవి మార్పుపై పలు ఊహాగానా లు సాగుతున్నాయి.
ఈడీ కస్టడీలో వలే కేజ్రీవాల్ జైలు నుంచి కూడా పరిపా లన కొనసాగిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.
ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు ఎవరు? అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి కొంత మంది పేర్లు వస్తున్నా, అరవింద్ కేజ్రీ వాల్ సతీమణి సునీత పేరు ఎక్కువగా వినిపి స్తోంది.
మరో వైపు సునీతా కేజ్రీవాల్‌కు సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా? అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఐఆర్‌ఎస్ అధికారిణిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు.
ఆమె ఉన్నత చదువులు చదివారు, ప్రస్తుతం ప్రజ ల్లోనూ మంచి ఆదరణ ఉంది. ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. కేజ్రీవాల్ తర్వాత ముఖ్య నేతలుగా ఉన్న మనీశ్ సిసోదియా, సత్యేం దర్ జైన్ కూడా జైలులో ఉన్నారు. దీంతో తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి…