మాజీ BRS ఎమ్మెల్యే నివాసానికి సీలు చేసిన అధికారులు
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ నివాసం ఉంటున్న ఈ 19 నెంబర్ గల ఇంటిని మంగళవారం సాయంత్రం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు ఇంటిని స్వాధీనం చేసుకొని సీలు వేశారు.
ఈ సంఘటనలో రెవెన్యూ ,పోలీస్ , ఎన్ఎస్పి అధికారులు మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు , పెద్దవూర తహసీల్దార్ పావని సరోజ , ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి , సాగర్ సీఐ భీసన్న , ఎస్సై సంపత్ గౌడ్ , నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ ఈ . భిక్షమయ్య ఆధ్వర్యంలో సదరు ఇంటిలోని వస్తువులను నందికొండ మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఎన్ఎస్పీ స్టోర్ రూమ్ కు తరలించి నివాసం దర్వాజాకు , బయటి గేటుకు కూడా సీల్ వేశారు.
ఈ విషయంలో సాగర్ డ్యామ్ ఈఈ మల్లికార్జునరావును వివరణ కోరగా… బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు సాగర్ లో హిల్ కాలనీలో నివాసం ఉన్న ఇల్లు మాజీ శాసనసభ్యులు నోముల నరసింహయ్య ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పేరు మీద ఆ ఇంటిని అలాట్మెంట్ చేసుకున్నారని , దానిపై ప్రభుత్వ నిధులతో మరమ్మతులు కూడా చేయించారన్నారు.
ప్రస్తుతం శాసనసభ్యులు గా కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయినా ఆ నివాసాన్ని కాంగ్రెస్ శాసనసభ్యులకు అప్పగించాల్సి ఉంది అన్నారు. ఈ విషయంలో పలుసార్లు నోటీసులు అందజేసిన , స్వయంగా మాట్లాడినా కూడా స్పందించలేదన్నారు .
దీంతో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం మంగళవారం నాడు ఆ నివాసాన్ని ,దానిలోని సామాగ్రిని తరలించి సీల్ వేసి రెవెన్యూ , పోలీసు అధికారుల సహకారంతో స్వాధీనం చేసుకున్నామని అన్నారు .
గతంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులుగా సేవలు అందించిన శాసనసభ్యులు నివాసాన్ని మీడియాకు ఎటువంటి సమాచారం లేకుండా ఇంటిలోని సామాన్లను తరలించి సీలు వేయడం గమనార్హం.
ఈ విషయంలో మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ సాగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నోముల భగత్ కుమార్ ను వివరణ కోరగా సాగర్లో తాను నివాసం ఉన్న ఇంటిని తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా, అక్రమంగా ఎన్ఎస్పి అధికారులు రెవెన్యూ పోలీస్ అధికారుల సహకారంతో స్వాధీనం చేసుకోవడం అన్యాయం అన్నారు. ఈ విషయంలో ఆందోళన నిర్వహించి ,న్యాయపరంగా పోరాటం సాగిస్తామని ఉన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు నివాసముందు ఆందోళన : నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలోని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నివాసం దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.