సుస్థిర ప్రభుత్వం సమర్థ నాయకత్వం బిజెపి పార్టీకే సాధ్యం…
పార్లమెంట్ ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ గెలుపు ఖాయం
బిజెపి సీనియర్ నాయకులు పసుపు నూరి వీరేశం
సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 05
సుస్థిర ప్రభుత్వం సమర్థ నాయకత్వం బిజెపి పార్టీకే సాధ్యమని పార్లమెంట్ ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ గెలుపు ఖాయం మని బిజెపి సీనియర్ నాయకులు పసుపు నూరి వీరేశం అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పది సంవత్సరాల పాలనలో జటిలమైన సమస్యలను పరిష్కరించడం జరిగింది.
ఒకటి జమ్ము కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తివేసి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం జరిగింది.రెండు సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టడం జరిగింది మూడవది ముస్లిం మహిళలకు సంబంధించి ట్రిపుల్ తలాకు రద్దు చేయడం జరిగింది.
అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది..దేశవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల రూపాయల వైద్య సదుపాయం కల్పించడం దాదాపు 50 కోట్ల మందికి నెలకి ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఐదు సంవత్సరాలు పాటు రేషన్ షాపు ద్వారా ఇవ్వడం జరిగినది.
రైతు సమన్ నిధి ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి 6000 రూపాయలు ఇవ్వడం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పట్టణాలలో ఇండ్లకు రెండు లక్షల 50 వేలు రూపాయలు ఇవ్వడం అలాగే దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా 100 వందే భారత్ సూపర్ ఫాస్ట్ రైళ్లు ప్రవేశ పెట్టడం,విశ్వకర్మ ద్వారా 16 రకాల చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల రుణం ఇవ్వడం,దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడ్డ వారికి విద్య ఉద్యోగ రంగంలో 10 శాతం రిజర్వేషన్ కల్పించడం,
ఇలా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి సమర్థ నాయకత్వం సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తున్న ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీదే,అదేవిధంగా ప్రపంచంలోనే ఒక అగ్ర నాయకుడిగా ఎదిగిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీది కావున ఏప్రిల్ లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వం సమర్ధ నాయకత్వం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వవలసిందిగా ఈ ప్రకటన ద్వారా కోరుతున్నాను…