భారాస నుండి భారతీయ జనతా పార్టీలోకి చేరికలు సీకే న్యూస్ వైరా నియోజకవర్గం ప్రతినిధి బాదావత్ హాథిరామ్ నాయక్ వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలంలో ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ రోజు బీజేపీ లో చేరారు. చల్లా శ్రీకాంత్, చల్లా నాగరాజు, పెనుగొండ నాగార్జున, సముద్రాల నర్సింహారావు, చల్లా కనకరావు, ఉమేష్ యాదవ్, తదితర నాయకులకు వినోద్ రావు పార్టీ …

భారాస నుండి భారతీయ జనతా పార్టీలోకి చేరికలు

సీకే న్యూస్ వైరా నియోజకవర్గం ప్రతినిధి బాదావత్ హాథిరామ్ నాయక్

వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలంలో ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ రోజు బీజేపీ లో చేరారు.

చల్లా శ్రీకాంత్, చల్లా నాగరాజు, పెనుగొండ నాగార్జున, సముద్రాల నర్సింహారావు, చల్లా కనకరావు, ఉమేష్ యాదవ్, తదితర నాయకులకు వినోద్ రావు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ- భారత దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవా అది కేవలం నరేంద్ర మోడీ తోనే సాధ్యమని చెప్పారు.

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తనని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated On 10 April 2024 5:24 PM IST
cknews1122

cknews1122

Next Story