మఠంపల్లిలో అంబరాన్ని అంటిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహనీయులు అంబేద్కర్
ఎంపీడీవో మామిడి జానకి రాములు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 14
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మఠంపల్లి మండల కేంద్రంలోని ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్, ఎల్ హెచ్ పి ఎస్, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా వేడుకలు ఘనంగా జరిగాయి.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో జానకి రాములు విచ్చేసి మాట్లాడుతూ
మహారాష్ట్రలోని అమ్మవాడ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ కేంద్రంలో తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనుడని భారతదేశానికి లౌకిక రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్య పరిపాలనకు అద్యుడని అలాగే మహాజన వర్గాల వారికి తాను రాసిన రాజ్యాంగం ప్రకారం పొందిన రిజర్వేషన్ ఫలాల ద్వారా
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాలు విద్య ఉద్యోగ సామాజిక రాజకీయ రంగాలలో నేడు ముందుకు పోయారని,
దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు కల్పించిన మహోన్నతుడని, అంటరానితనం అసమానతలపై, పోరాడి వాటిని రూపుమాపడమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై పోరాడిన అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు ఆలోచనలను పునుకిపుచ్చుకొని నేటి యువత ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు.
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రెడపంగు నాగరాజ్ నాగరాజు ఎల్ హెచ్ పి ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మాలోతు నాగు నాయక్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏసుమల్ల రాములు దళిత నాయకుడు దేవ పంగు ప్రసాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల జయరాజ్ ప్రెస్ క్లబ్ కోశాధికారి మాలోతు రవీందర్ నాయక్ దళిత నాయకులు రాయిరాల లింగయ్య ఆరాల నాగరాజు కష్టాల మట్టయ్య ఆరాల వీరస్వామి మేడి బుంగయ్య పిఎసీ ఎస్ చైర్మన్ దైద రాయులు కాటిపల్లి మల్లేష్ మాతంగి సతీశ్,కొత్తపల్లి రాజేష్, జార్జి,నందా,సైదులు,వస్కుల వినోద్ కాటిపల్లి.రాజేష్ తదితరులు పాల్గొని అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు.