రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మృతి
నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. అద్దంకి -నార్కట్పల్లి హైవేపై జరిగిన యాక్సిడెంట్లో బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సాధినేని జనార్ధన్ రావు(48) మృతి చెందాడు.
బైక్ పై టౌన్లోకి వస్తున్న ఆయనను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో జనార్ధన్ ఎగిరి పడటంతో తలకు బలమైన గాయాలై స్పాట్లో ప్రాణాలు విడిచారు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నటుడు రఘుబాబు కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన నల్గొండ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు (51) BRS టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.
ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్డుండేవాడు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న KA 03 MP 69 14 నెంబర్ గల BMW కారు జనార్దన్ రావు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు స్పాట్‌లోనే మృతి చెందాడు. మృతుని భార్య నాగమణి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంగా తెలిసింది. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, తనయుడు ఉన్నారు.
అయితే ప్రమాదం అనంతరం రఘుబాబుతో స్థానికులు మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. బైక్‌పై వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు.. ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబు వారితో మాట్లాడటం దిగువన వీడియోలో చూడొచ్చు. అయితే రఘుబాబు టెన్షన్ పడుతూ ఉండగా.. పక్కన ఉన్న వ్యక్తులు వాటర్ తాగమని సూచించారు.