నిండు ప్రాణం తీసిన దుండగులు.. కేసు నమోదు
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని గంధసిరి గ్రామంలో బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇద్దరు దుండగులు షరీఫ్ (24)అనే యువకుడి పై దాడి చెయ్యగా షరీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
చుట్టుపక్కల వారు చూసి వెంటనే ముదిగొండ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగా వెంటనే సీఐ రాజిరెడ్డి, ఎస్సై, పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి పరిశీలించారు. దుండగులను వెంటనే పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు సమాచారం.