దేశం అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీతోనే సాద్యం
-ఎంపీగా గెలిపిస్తే గూడూరు నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తా
-కూటమి తిరుపతి బిజెపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ వరప్రసాదరావు
Ck news (గూడూరు – ప్రతినిధి రమణయ్య )
గత పది సంవత్సరాలుగా భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాలన ప్రపంచ దేశాలు చర్చించుకునేలా చేపట్టారని, ఇంకా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మళ్లీ భారతదేశానికి నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించుకోవాలని కూటమి తిరుపతి బిజెపి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు పేర్కొన్నారు. మంగళవారం గూడూరు పట్టణం సనత్ నగర్ లో తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షులు చంద్రప్ప,,నాయుకులతో కలిసి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో వరప్రసాదరావు మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే సంవత్సరంలోపు సముద్ర ముఖద్వారాలను ఓపెన్ చేయిస్తామని అదే విధంగా పులికాట్ సరస్సులో కేంద్ర పర్యావరణ శాఖ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సడలింప చేయిస్తానని వెల్లడించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా రూపొందించేందుకు కృషి చేస్తానన్నారు.
గూడూరు పట్టణంలో అసంతృప్తిగా మిగిలిపోయి ఉన్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానన్నారు. అదే విధంగా వివేకానంద రోడ్డు ఎదురుగా ఉన్న రైల్వే గేట్ ప్రాంతంలో బాక్స్ టైప్ బ్రిడ్జిని నిర్మించి ఆ ప్రాంత ప్రజల సమస్యలను తొలగిస్తానన్నారు. ఆటోనగర్ నిర్మాణాన్ని వేగవంతంగా జరిగేలా చూస్తానని వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని చెరువును సుందరవందనంగా తీర్చిదిద్ది విహారయాత్రాస్థలంగా ఏర్పాటు చేస్తామన్నారు. గూడూరు మున్సిపాలిటీకి అమృత పథకంతో సమానంగా కేంద్రం నుండి నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తానన్నారు. గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం మనపాడు, నవాబుపేట ప్రాంతాల్లో అటవీశాఖ అనుమతితో రోడ్ ఏర్పాటు చేస్తానన్నారు.
ఎన్డీఏ కూటమి గూడూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సునీల్ కుమార్ ను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కూటమి నాయకులతో కలిసి భారీ విజయానికి కృషి చేయాలన్నారు. తనను ఎంపీగా, సునీల్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సంయుక్తంగా గూడూరు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
తిరుపతి జిల్లా బిజెపి అధ్యక్షులు చంద్రప్ప మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ రూపొందించే సంక్షేమ పథకాలు ,అభివృద్ధి ప్రపంచ దేశాల్లో కీర్తింపబడుతున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకటిగా గుర్తించేందుకు నరేంద్ర మోడీ పాలనే నిదర్శనం అన్నారు.
ఎన్డీఏ కూటమి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావు గుర్తు కమలం, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పాశిం సునీల్ కుమార్ గుర్తు సైకిల్ పై టిడిపి, జనసేన పార్టీ నాయకులతో కలిసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు సైనికుల్లా కృషి చేయాలన్నారు.
అనంతరం రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ నరసప్ప బీజేపీ పార్టీలో చేరారు ఆయనకు వరప్రసాద్ రావు,బిజెపి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన నరసప్ప మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆశయాలకు ఆకర్షితుడు నై బిజెపిలో చేరానని పేర్కొన్నారు.
వరప్రసాదరావు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా భారతదేశం అంటే వారికి గుర్తొచ్చేది ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతీయ జనతా పార్టీలో వర ప్రసాదరావుతో కలిసి తాను పనిచేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
గూడూరు పరిసర ప్రాంతాల్లో ని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో సీనియర్ మేనేజర్ గా పనిచేసిన అనుభవం తనకు ఉందని, రైతులు ప్రజలతో సన్నిహిత సంబంధం ఉందన్నారు.దీంతో కూటమి ఎంపి,ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న డాక్టర్ వెలగపల్లి వరప్రసాద రావు, పాశిం సునీల్ కుమార్ ల గెలుపుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి , గిరి రెడ్డి, కోటారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, గూడూరు అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి బిందు రెడ్డి, వాకాడు ,చిట్టమూరు, కోట మండల పార్టీ అధ్యక్షులు వల్లి ప్రసాద్, శరత్ రెడ్డి, రమేష్, యారం వెంకటసుబ్బయ్య, మన్నెం శ్రీనివాసులు శ్రీనివాసులు, దయాకర్,వినిష్ దాసరి వెంకటేశ్వర్లు,,దిలీప్, మధిర సునీల్ కుమార్, మహిళా నాయకురాళ్లు తూపిలి లక్ష్మి , జీనత్, భవాని, తదితరులు పాల్గొన్నారు.