Uncategorized

హాస్టల్ గేటు ముందు ధర్నా నిర్వహించిన విద్యార్థినిలు

హాస్టల్ గేటు ముందు ధర్నా నిర్వహించిన విద్యార్థినిలు

హాస్టల్ గేటు ముందు ధర్నా నిర్వహించిన విద్యార్థినిలు

నాలుగు రోజులలో సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ

సికే న్యూస్ వేములపల్లి సెప్టెంబర్ 3

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో స్థానిక మోడల్ స్కూల్ హాస్టల్ గేటు ముందు హాస్టల్ లో ఉండేటటువంటి విద్యార్థినులు మంగళవారం ధర్నా నిర్వహించారు

ఈ సందర్భంగా విద్యార్థునిలు తమ డిమాండ్ ను తెలియజేస్తూ మాడుగులపల్లి మండలానికి సంబంధించినటువంటి కస్తూరిబా గాంధీ హాస్టల్ విద్యార్థునిలకు హాస్టల్ వసతి లేకపోవడంతో వారిని కొన్ని రోజుల క్రితం వేములపల్లి మోడల్ స్కూల్ హాస్టల్ కి తరలించడంతో మాకు ఇబ్బందిగా ఉన్నదని గత వారం రోజుల క్రితం ధర్నా నిర్వహిస్తే ధర్నా ప్రాంతానికి చేరుకున్నటువంటి అధికారులు వారం రోజులలో విద్యార్థులను వేరే హాస్టల్ కి తరలిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి వారిని ఇంతవరకు తరలించకపోవడంతో విద్యార్థినుల సంఖ్య అధికంగా ఉండడంతో గత రెండు రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలతో అంటువ్యాధుల బారిన పడుతున్నామని అన్నారు గేటు ముందు కూర్చున్న విద్యార్థులు తోటి విద్యార్థిని విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను లోనికి రానియ్యకపోవడంతో అక్కడికి చేరుకున్న ఎంఈఓ బాలాజీ నాయక్

ఈ సమస్యకు రెండు రోజులలో పరిష్కారం చూపెడతామని చెప్పిన వినకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులనులతో మాట్లాడిన ఎమ్మెల్యే విద్యార్థినిలకు సమాధానం చెబుతూ వినాయక చవితి పండుగ వెళ్లిన మరుక్షణమే వారికి వేరే హాస్టల్లో వసతి కల్పించి వారిని తరలిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన విద్యార్థునులు ధర్నా విరమించుకున్నారు దానితో తోటి విద్యార్థులు క్లాసులకు మరియు ఉపాధ్యాయులు తమ విధులకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ మరియు విద్యార్థి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button